Fri Mar 20 2026 21:17:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలుగు రాజకీయాల్లో సంచలనం

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీతో పొత్తుకు రూట్ క్లీయర్ అవుతోంది. తెలంగాణ రాజకీయాలపై చర్చించేందుకు శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు రానున్నారు. రేపు చంద్రబాబు నాయుడును తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవబోతున్నారు. ఈ మేరకు చర్చలకు రేపు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయంగా టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి ఆహ్వానించారు. మరోవైపు టీడీపీతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రకటించారు. రేపు చర్చలు సఫలమై కాంగ్రెస్, టీడీపీ పొత్తు కుదిరితే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కాబోతోంది.
Next Story

