Thu Mar 19 2026 01:12:29 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి సీమ యువనేత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో నేత చేరనున్నారు. అయితే, ఆ నేత టీడీపీ మాజీ నేత, వైఎస్ కుటుంబానికి బద్ధవ్యతిరేక అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ నేత 7వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇవాళ జగన్ ను కలిసిన సిద్ధార్థ రెడ్డి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. తనకు, చిన్నాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమేనన్నారు.
Next Story

