Fri Dec 05 2025 16:31:59 GMT+0000 (Coordinated Universal Time)
రెండో మ్యాచ్ భారత్ దే.. సిరిస్ మనదే
భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది.

భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. తక్కువ స్కోరు అయినా భారత్ బ్యాటర్లు విపలమవ్వడంతో విజయం కోసం కష్టపడక తప్పలేదు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కొహ్లి విఫలం కావడంతో భారత్ కష్టాల్లో పడినట్లనిపించింది. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా మాత్రమే స్కోరు చేయగలిగారు. మిగిలన బ్యాటర్లు ఎవరూ గౌరవ ప్రదమైన స్కోర్లు చేయలేకపోయారు.
యాభై పరుగులు
కేఎల్ రాహుల్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చేతిలో నాలుగు వికెట్లు ఉండటంతో కొంత భరోసా ఉణ్నప్పటికీ అందరూ బౌలర్లు కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అక్షర్ పటేల్ అవుటయిన తర్వాత భారత అభిమానులు సైలెంట్ అయ్యారు. కులదీప్ యాదవ్ కొంత నిలదొక్కుకోవడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. కేఎల్ రాహుల్ 64 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ కు విజయం దక్కింది.
Next Story

