Sun Feb 01 2026 03:53:24 GMT+0000 (Coordinated Universal Time)
ఛీ..ఛీ.. ఇదేం స్కూల్..

పూణేలో ఓ పాఠశాల తమ విద్యార్థినులకు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇక్కడి ఎంఐటీ స్కూల్ తమ విద్యార్థినులు కేవలం వైట్ లేదా స్కిన్ కలర్ లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు, కేవలం పాఠశాల నిర్దేశించిన సమయంలోనే వాష్ రూంలకు వెళ్లాలని, విద్యార్థినులు వేసుకున్న స్కర్ట్ పొడవు ఎంత ఉందో డైరీలో తల్లిదండ్రుల చేత రాయించుకొని రావాలని వివాదాస్పద ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నిర్ణయాన్ని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎటువంటి దురుద్దేశాలూ లేవని, గతంలో తమకు ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎటువంటి రహస్య ఎజెండా లేదని సదరు ఎంఐటీ పాఠశాల ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డా.సుచిత్ర కరడ్ నగారే తెలిపారు.
Next Story

