Sat Dec 06 2025 00:22:12 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ కీలక ప్రకటన
ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. సోనియా గాంధీ తో చర్చించిన తర్వాత శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. తాము భాగస్వామ్య [more]
ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. సోనియా గాంధీ తో చర్చించిన తర్వాత శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. తాము భాగస్వామ్య [more]

ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. సోనియా గాంధీ తో చర్చించిన తర్వాత శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. తాము భాగస్వామ్య పక్షాలతో ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని శరద్ పవార్ తెలిపారు. శివసేనతో తాము ఇంకా చర్చలు జరపలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తో ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా తాను చర్చించలేదని శరద్ పవార్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు తొందరపడాల్సిన అవసరం లేదని ఎన్సీపీ, కాంగ్రెస్ లు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
Next Story