Thu Mar 19 2026 09:04:11 GMT+0530 (India Standard Time)
సంజు శాంసన్ గొప్ప మనస్సు

వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు పెద్దఎత్తున విరాళాలు అందించగా, తాజాగా క్రికెటర్లు సైతం తమ గోప్ప మనస్సును చాటుకుంటున్నారు. యువ క్రికెటర్ సంజూ శాంసన్ కేరళకు తనవంతుగా రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తండ్రి, సోదరుడు ఈ మేరకు ముఖ్యమంత్రికి చెక్ అందించారు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదని, వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయంగా ఉండేందుకే చేశానని శాంసన్ స్పష్టం చేశాడు. అందరూ వారికి తోచిన సహాయం చేయాలని కోరాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో క్రికెటర్ హార్ధిక్ పాండ్యా సైతం కేరళ వరదలపై స్పందించారు. కేరళవాసులు ధైర్యంగా ఉండాలని, వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరు ముందుకురావాలని వారు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Next Story

