Thu Jan 29 2026 01:14:12 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : సృష్టించేది చంద్రబాబే.. రచ్చ చేసేదీ ఆయనే
చంద్రబాబు కావాలనే ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో సృష్టిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు గతంలో ఏ రాజకీయ పార్టీ నేతలు [more]
చంద్రబాబు కావాలనే ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో సృష్టిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు గతంలో ఏ రాజకీయ పార్టీ నేతలు [more]

చంద్రబాబు కావాలనే ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో సృష్టిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు గతంలో ఏ రాజకీయ పార్టీ నేతలు చేయలేదన్నారు. జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తే కార్యకర్తలకు కోపం రాదా? అని ప్రశ్నించారు. పట్టాభి అన్న వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి సమర్థించడమేంటని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు తొలి నుంచి కుట్ర రాజకీయాలు చేయడం అలవాటేనని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్తగా బంద్ లు, దీక్షలు డ్రామాలు ఆడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
Next Story