Mon Dec 15 2025 20:07:55 GMT+0000 (Coordinated Universal Time)
అనర్హతకే నిర్ణయం తీసుకున్నాం
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమయ్యామని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రఘురామ కృష్ణంరాజు పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమయ్యామని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రఘురామ కృష్ణంరాజు పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. [more]

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమయ్యామని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రఘురామ కృష్ణంరాజు పార్టీని నష్టపర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ సమయం లేకపోవడం వల్లనే నేతలను కలవలేకపోతున్నారన్నారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని సజ్జల రామకృష్నారెడ్డి తెలిపారు. రఘురామ కృష్ణంరాజు విషయంలో పార్టీ చాలా సంయమనంతో వ్యవహరించిందన్నారు. ఆయన పద్ధతి మార్చుకోకపోవడం వల్లనే అనర్హత వేటు వేయాయలని పిటీషన్ ను స్పీకర్ కు అందజేస్తున్నామని సజ్జల తెలిపారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
Next Story