Tue Dec 16 2025 09:36:08 GMT+0000 (Coordinated Universal Time)
అక్రమాలు జరిగాయి..నిజాలు నిదానంగా
రాజధాని అమరావతిలో అక్రమాలు, అవకతవకలు జరిగింది వాస్తవమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాంకేతికపరంగా న్యాయస్థానంలో నిరూపించలేకపోయి ఉండవచ్చు కాని, రాజధానిలో అవినీతి జరిగిన మాట [more]

రాజధాని అమరావతిలో అక్రమాలు, అవకతవకలు జరిగింది వాస్తవమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాంకేతికపరంగా న్యాయస్థానంలో నిరూపించలేకపోయి ఉండవచ్చు కాని, రాజధానిలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆ ఇక్కడ వారెవరైనా చెబుతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని, ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా తమ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు తమ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
Next Story