సాధ్వీ ప్రగ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ భోపాల్ నియోజకవర్గ అభ్యర్థి సాధ్వీ ప్రగ్ఞాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది హిందువని, అతడు గాడ్సే అని కమల్ హాసన్ [more]
బీజేపీ భోపాల్ నియోజకవర్గ అభ్యర్థి సాధ్వీ ప్రగ్ఞాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది హిందువని, అతడు గాడ్సే అని కమల్ హాసన్ [more]

బీజేపీ భోపాల్ నియోజకవర్గ అభ్యర్థి సాధ్వీ ప్రగ్ఞాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది హిందువని, అతడు గాడ్సే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అచ్చి ప్రగ్ఞా సింగ్ నాథూరామ్ గాడ్సే నిజమైన దేశభక్తుడని, ఎప్పటికీ దేశభక్తుడేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి అసలైన వారసుడు గాడ్సేనే అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడైతే గాంధీ దేశద్రోహా అని నేషనల్ కాన్ఫరేన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇక, సాధ్వీ వ్యాఖ్యలను స్వంత పార్టీ బీజేపీ సైతం ఖండించింది. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమెను ఆ పార్టీ ముఖ్యులు ఆదేశించారు.