Sun Mar 22 2026 16:53:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి?

మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరికి విశాఖ పట్నం కో -ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసందింది. వడ్డీతో పాటు ఇతర బకాయీలకు సంబంధించి 9.54 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆస్తులను తనఖాపెట్టి సబ్బం హరి బ్యాంకు నుంచి 8.54 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే బకాయీలు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. మద్దెలపాలెంలోని డెక్కన్ క్రానికల్ భవన వేలానికి సంబంధించి బ్యాంకు నుంచి సబ్బం హరి రుణం పొందినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
Next Story

