Sun Mar 15 2026 10:41:30 GMT+0530 (India Standard Time)
సబ్బం సవాల్ ఇదే
మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖపట్నం ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ పెట్టి చూడమని సబ్బం హరి [more]
మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖపట్నం ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ పెట్టి చూడమని సబ్బం హరి [more]

మూడు రాజధానుల ప్రతిపాదనను విశాఖపట్నం ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ పెట్టి చూడమని సబ్బం హరి సవాల్ విసిరారు. ఒక ఛానల్ లో సబ్బం హరి మాట్లాడుతూ రాష్ట్రంలో సైలెంట్ సపోర్ట్ అమరావతి రాజధాని వైపు ఉందన్నారు. అంతేకాకుండా విశాఖపట్నం కార్పొరేషన్ లో వైసీపీ గెలిస్తే తాను ఇక రాజకీయ చర్చల్లో కూడా పాల్గొనబోనని సబ్బం హరి సవాల్ విసిరారు. విశాఖ ప్రజలు వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాజధాని రైతులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని తెలిపారు.
Next Story