Tue Mar 17 2026 15:51:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆర్టీసీ కార్మికులకు షాకిచ్చిన కేసీఆర్
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అనంతరం సునీల్ శర్మ ఒక ప్రకటన [more]
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అనంతరం సునీల్ శర్మ ఒక ప్రకటన [more]

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అనంతరం సునీల్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని తెలిపారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెలోకి వెళ్లి, ఇష్టమొచ్చినప్పుడు చేరతామంటే చట్టం అంగీకరించదని చెప్పారు. లేబర్ కోర్టు నిర్ణయం వెలువడేవరకూ సంయమనం పాటించాలని కోరారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం విధుల్లోకి తీసుకునే అవకాశం లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే క్షమించబోమని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
Next Story