Sat Mar 21 2026 15:56:15 GMT+0530 (India Standard Time)
ఇక్కడ బీజేపీకి ఊహించని ఫలితం...

కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్నం భారీ మెజార్టీతో విజయం సాధించారు. మునిరత్నం 80,282 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో, జేడీఎస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి ముణిరత్నంకి 44,100 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో 78 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో స్థానం పెరిగింది.
Next Story

