Mon Mar 23 2026 22:37:51 GMT+0530 (India Standard Time)
బాబు దీక్ష ఖర్చు 30 కోట్లా?

చంద్రబాబు దీక్ష పేరుతో 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు చేసేది దీక్ష కాదని ఉపవాసం అని ఆమె అభిప్రాయపడ్డారు. అవగాహన లేని క్రీడాకారులతో చంద్రబాబు దీక్షా వేదికపై భజన చేయించుకుంటున్నారన్నారు. దీక్ష విజయవాడలో చేసి లాభం ఏంటని, ఢిల్లీలో చేయాలని రోజా సూచించారు. ఎన్టీఆర్ డూప్ తో డైలాగ్ లు కొట్టించుకుని వేదికపై చంద్రబాబు నవ్వుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా అప్పుడే చేసి ఉంటే కేంద్ర దిగి వచ్చేదని రోజా విమర్శించారు.
Next Story

