Fri Jan 30 2026 01:22:57 GMT+0000 (Coordinated Universal Time)
దివాకర్ కు మరోసారి షాక్
జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులను మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గతంలో సీజ్ చేసిన బస్సులను దివాకర్ రెడ్డి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడుదల [more]
జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులను మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గతంలో సీజ్ చేసిన బస్సులను దివాకర్ రెడ్డి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడుదల [more]

జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులను మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గతంలో సీజ్ చేసిన బస్సులను దివాకర్ రెడ్డి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడుదల చేయించుకుంది. అయితే బస్సులు రోడ్డు మీదకు వచ్చి నాలుగు రోజులు కాకముందే మరోసారి ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ఆరు బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడుస్తుండటం వల్లనే సీజ్ చేశామని ఆర్టీఏ అధికారులు చెబుతుండగా, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం తమ బస్సులను టార్గెట్ చేసిందని జేసీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Next Story