Fri Mar 27 2026 04:37:11 GMT+0530 (India Standard Time)
బాబును అక్కడిలాగే ఇక్కడా.....?

లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాలని, రాజకీయ నేరస్థుడైన చంద్రబాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా అన్నారు. తెలంగాణాలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణనుంచి టీడీపీని ప్రజలు తరిమికొట్టారన్నారు. మీడియాలు, సర్వేలు కూడా అక్కడ ఏం చేయలేకపోయాయన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేస్తే ఎవరూ ఊరుకోనన్న విషయం గ్రహించాలన్నారు. కూటమిగట్టి చంద్రబాబు కుట్రలు చేసినా కేసీఆర్ ను గెలిపించుకున్నారంటే అక్కడి ప్రజలకు రోజా హ్యాట్సాఫ్ చెప్పారు. ఏపీలోనూ చంద్రబాబు నరకపాలన త్వరలోనే అంతమవుతుందని శాపనార్థాలు పెట్టారు. నిన్నటి నుంచి కరకట్టపైనే కాలయాపన చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని సెటైర్ వేశారు.
Next Story

