Wed Mar 25 2026 21:48:07 GMT+0530 (India Standard Time)
Rk roja : వైసీపీ విజయం ఖాయం…మెజారిటీపైనే?
బద్వేలు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమయిందని, మెజారిటీ ఎంతనేదే తేలాల్సి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గుంపులుగా ఎందరు వచ్చినా జగన్ సింహంలా [more]
బద్వేలు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమయిందని, మెజారిటీ ఎంతనేదే తేలాల్సి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గుంపులుగా ఎందరు వచ్చినా జగన్ సింహంలా [more]

బద్వేలు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమయిందని, మెజారిటీ ఎంతనేదే తేలాల్సి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గుంపులుగా ఎందరు వచ్చినా జగన్ సింహంలా సింగిల్ గానే వస్తారన్నారు. ఏ ఎన్నిక అయినా వైసీపీదే విజయమని రోజా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఒకరు మామకు వెన్నుపోటు పొడించారని, మరొకరు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. బద్వేలు లో వైసీపీ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story