Fri Dec 05 2025 12:23:49 GMT+0000 (Coordinated Universal Time)
రోజా సంచలన నిర్ణయం.. సినిమాలకు, జబర్దస్త్ కు గుడ్ బై !
నగరి నియోజకవర్గం నుంచి వైసిపి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన రోజా.. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీకోసం రోజా

నగరి : సినీ నటిగా, రాజకీయ వేత్తగా ఆర్కే రోజా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సినిమా హీరోయిన్ గా అగ్రకథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన రోజా.. రాజకీయరంగ ప్రవేశంతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత టిడిపి, ఆ తర్వాత వైసిపిలోకి మారిన రోజా.. పార్టీ ఏదైనా ప్రత్యర్థులపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఆమెకు ఆమే సాటి.
నగరి నియోజకవర్గం నుంచి వైసిపి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన రోజా.. పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీకోసం రోజా పడుతున్న కృషిని గుర్తించిన సీఎం జగన్.. ఆమెకు కేబినెట్ లో స్థానం కల్పించారు. రాష్ట్రమంత్రిగా మరికొద్దిసేపట్లో రోజా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు మంత్రి పదవి రావడంపై రోజా స్పందించారు. తనకు మంత్రి పదవి ఇవ్వడంతో సీఎం జగన్ పై తనకున్న అభిమానం మరింత రెట్టింపయిందన్నారు.
మంత్రిగా తనకు ఏ శాఖను కేటాయించినా.. సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. అలాగే సినిమాలకు, జబర్దస్త్ కు గుడ్ బై చెప్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మంత్రిగా పూర్తి సమయాన్ని ప్రజల కోసం కేటాయించాల్సి ఉంటుందని, అందువల్లే సినిమాలకు, జబర్దస్త్ కు దూరమవుతున్నట్లు తెలిపారు. ప్రాణం ఉన్నంతవరకూ పార్టీకోసం కృషి చేస్తానని రోజా పేర్కొన్నారు.
Next Story

