Mon Mar 23 2026 08:13:17 GMT+0530 (India Standard Time)
బాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు

దాచేపల్లి బాలిక అత్యాచారం కేసులో నిందితుడు సుబ్బయ్య ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. సుబ్బయ్య ఆచూకీ కోసం పెద్దయెత్తున పోలీసులు సెర్చ్ ఆపరేషన్ జరుపుతున్నారు. కృష్ణా నది ఒడ్డున ఉంటారన్న అనుమానంతో డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. సుబ్బయ్యను పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకోలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఆమె మండిపడ్డారు. దాచేపల్లి బాధితురాలిని ఆర్కే రోజా పరామర్శించారు. చంద్రబాబు పాలనలో అత్యాచారాలు తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని రోజా ఫైరయ్యారు.ఇంతకన్నా అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ డీజీపీ ఎక్కడా లేరన్నారు.
Next Story

