Sat Mar 21 2026 23:51:27 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన ఇంటితో పాటు కొడంగల్ లో ఉన్న ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇటీవల జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై కూడా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఐటీ దాడులతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయింది. రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
Next Story

