Fri May 03 2024 15:00:34 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సంచలన వ్యాఖ్యలివే....!!
ఈ నెల 25వ తేదీన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హరీశ్ రావును కలిసిన తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కారు డ్రైవర్ ను మార్చేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సీఎం కుర్చీ గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో హరీశ్ రావు వ్యవహారం తుపాను ముందు ప్రశాంతతలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ నెల 25వ తేదీన హరీశ్ రావు ఇంటి ఫుటేజీని పరిశీలిస్తే కేసీఆర్ కు ఒక స్పష్టత వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story