Fri Mar 20 2026 15:12:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేవంత్ రాజీనామా

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి మరోసారి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ముందు రేవంత్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రూపొందించిన లేఖలను టీడీపీ అధినేత చంద్రబాబుకు అమరావతి వెళ్లి ఇచ్చి వచ్చారు. అయితే ఆ లేఖలు ఇంతవరకూ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. అలాగని రేవంత్ రెడ్డి శాసనసభకు హాజరుకావడం లేదు. తన గన్ మెన్లను కూడా వెనక్కు పంపారు. అయితే తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ మరికాసేపట్లో రద్దు చేస్తారన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి మరోసారి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కు పంపినట్లు తెలుస్తోంది.
Next Story

