Sun Mar 22 2026 02:39:28 GMT+0530 (India Standard Time)
రేవంత్ ఇంటి వద్ద టెన్షన్...టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు సుదీర్ఘగా జరుగుతున్నాయి. నిన్న ఉదయం ఏడు గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సుమారు 22 గంటలుగా రేవంత్ రెడ్డిని నిర్విరామంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న సాయంత్రం నుంచి తమ నాయకుడిని చూపించడం లేదని, ఒక్కసారి రేవంత్ రెడ్డిని చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఈ మేరకు నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతోంది.
Next Story

