టీఆర్ఎస్ లో వాళ్లంతా రద్దయిన వెయ్యినోట్లే
పార్టీ మారిన ఎమ్మెల్యే ల పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు [more]
పార్టీ మారిన ఎమ్మెల్యే ల పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు [more]

పార్టీ మారిన ఎమ్మెల్యే ల పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేరని ఆయన ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి..తలసాని.. సబితా.. గంగుల. పోచారం… ఇలా అందరూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానం నాగేందర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీయే రాజకీయ బతుకునిచ్చిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకుంటే రోడ్డు మీద పిచ్చికుక్క కంటే హీనంగా ఉండేవాడివని, పిచ్చిగా మాట్లాడితే వీపు విమానం మోత మోగుతుందని రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కు చురకలంటించారు. పార్టీ మారిన వాళ్లు రద్దయిన వెయ్యినోట్ల లాంటి వారన్నారు.

