Fri Dec 19 2025 03:26:18 GMT+0000 (Coordinated Universal Time)
భారీ భద్రత మధ్య కొడంగల్ కు రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన స్టార్ క్యాంపెయినర్ అయినందున ఎక్కడైనా ప్రచారం చేసే హక్కు ఆయనకు ఉంటుందని... ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పోలీసులను ఆదేశించడంతో రేవంత్ ను జడ్చర్ల పోలిస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య కొడంగల్ కు తరలించారు. ఇవాళ కేసీఆర్ సభ ఉన్నందున కొడంగల్ లో నిరసనలకు రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులు ఇవాళ తెల్లవారు జామున బలవంతంగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story

