Tue Mar 17 2026 23:30:47 GMT+0530 (India Standard Time)
రేవంత్ రెడ్డికి భారీ భద్రత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని, రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆదేశించగా... కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కేంద్రం అప్పీల్ కు వెళ్లగా... రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ కి భద్రత ఇవ్వాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి 4 + 4 గన్ మెన్లు, రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు. అయితే, భద్రత కేవలం ఎన్నికల రోజు వరకే కొనసాగనుంది.
Next Story

