Mon Mar 16 2026 20:19:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందన

రాష్ట్రంలో ప్రజలు వారి తరపున పోరాటం చేయాల్సిన బాధ్యతను మామీద పెట్టినట్లుగా ఈ ఓటమిని భావిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల పై ఆయన స్పందిస్తూ... ఈ తీర్పును రాష్ట్రాన్ని దోచుకునేందుకు లైసెన్స్ గా, కుటుంబ పాలనకు పేటెంట్ గా టీఆర్ఎస్ భావించాల్సిన అవసరం లేదన్నారు. మరింత బాధ్యతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పై ఉందని పేర్కొన్నారు. ఫామ్ హౌజ్ లో బందీ అయిన పరిపాలనను ఇప్పుడైనా సచివాలయానికి తీసుకురావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు.
Next Story

