Tue Mar 24 2026 07:54:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబును కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినందున ఈ క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన నాయకులైన రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కలవడం దేశానికి శుభసూచికం. ప్రజల కోసం పనిచేసి, త్యాగాలు చేసిన ఇద్దరు నాయకులు కలవడం ఇప్పుడు అత్యవసరం అని అన్నారు. రెండు పార్టీలకూ కూటములను నడిపిన అనుభవం ఉంది. దేశాన్ని ముందుకు తీసుకోవడానికి వీరిద్దరి కలయిక మేలు చేస్తుందని పేర్కొన్నారు.
Next Story

