Sun Mar 22 2026 04:18:10 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు రేవంత్ 24 గంటల టైం

2009 నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి తన ఆస్తులు, 2001 నుంచి ఉద్యమంలోకి దిగినప్పటి నుంచి కేసీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించడానికి సిద్ధమేనా అని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. రేపు సాయంత్రం వరకూ సమయమిస్తున్నానని, ఇద్దరి ఆస్తులపై విచారణ చేయించాలని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరం కలసి లేఖలు రాద్దామని అన్నారు. తాను లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్ అందుకు స్పందించికపోతే అక్రమ ఆస్తులు ఉన్నట్లేనని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.
Next Story

