Sun Mar 22 2026 02:39:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి

ఐటీ అధికారుల సుదీర్ఘ విచారణ అనంతరం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. తమ నాయకుడిని ఒక్కసారి చూపించాలంటూ రేవంత్ అనుచరులు, అభిమానులకు ఆయన అభివాదం చేశారు. రేవంత్ ఇంటి వద్ద అభిమానుల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లోపలికి వెళ్లి ఐటీ అధికారులతో మాట్లాడి ఆయనను బయటకు తీసుకువచ్చారు. దీంతో ఆయన వచ్చి సైగలతోనే కార్యకర్తలను శాంతించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పూర్తిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు రక్తంతో బొట్లు పెట్టారు. తమ నాయకుడికి ప్రాణహాని ఉందని, లైవ్ లో విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.
Next Story

