Thu Mar 26 2026 12:17:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేవంత్ ఆచూకీపై హైకోర్టు సీరియస్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటిక్రితం రేవంత్ రెడ్డి కేసును హైకోర్టు విచారించింది. రేవంత్ ఆచూకీని తెలపాల్సిందిగా హైకోర్టు వికారాబాద్ ఎస్పీని ఆదేశించింది. విచారణను పదినిమిషాల పాటు వాయిదా వేసింది. రేవంత్ రెడ్డిని అర్థరాత్రి తలుపులు పగలకొట్టి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులు తెలపడం లేదనిఆయన భార్య గీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ సభ పూర్తయిన వెంటనే రేవంత్ ను ఆయనఅనుచరులను వదిలిపెడతామని పోలీసులు చెబుతున్నారు.
Next Story

