Sun Mar 22 2026 01:14:45 GMT+0530 (India Standard Time)
రేవంత్ ఆస్తుల వెనక చంద్రబాబు

రేవంత్ రెడ్డి ఆస్తులన్నీచంద్రబాబు బినామీయేనని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికపోయిన రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబును కూడా విచారించాలన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అండదండలతోనే ఆస్తులన్నీ సంపాదించారన్నారు. ఆ ఆస్తులన్నీఎక్కడి నుంచి వచ్చాయో ఐటీ అధికారులు బయటపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును కూడా వెంటనే చేపట్టి చంద్రబాబును కూడా విచారించాలని భూమన డిమాండ్ చేశారు. ఐటీ అధికారులకు చంద్రబాబునాయుడు ఆస్తులు కన్పించడం లేదా? అని భూమన ప్రశ్నించారు.
- Tags
- andhra pradesh
- bhumana karunakar reddy
- congress
- essets
- income tax rides
- nara chandrababu naidu
- revnath reddy
- telangana
- telugudesam party
- ysr congress party
- ఆదాయపు పన్ను శాఖ దాడులు
- ఆంధ్రప్రదేశ్
- ఆస్తులు
- కాంగ్రెస్
- తెలంగాణ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భూమన కరుణాకర్ రెడ్డి
- రేవంత్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

