Tue Mar 17 2026 16:37:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేవంత్ ఎఫెక్ట్... ఎస్పీ అవుట్..!

రేవంత్ రెడ్డి బలవంతపు అరెస్ట్ పై ఈసీ సీరియస్ అయ్యింది. రేవంత్ అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరుపై ఈసీ చర్యలు తీసుకుంది. వికారాబాద్ ఎస్పీ టి.అన్నపూర్ణను బదిలీ చేస్తు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది. మరో వైపు హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం డీజీపీ స్వయంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Next Story

