Tue Mar 17 2026 18:25:44 GMT+0530 (India Standard Time)
రేవంత్ రెడ్డి అరెస్ట్ కి కారణమిదే..!

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై సీఈఓ రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి బంద్ కి పిలుపునిచ్చారని, టీఆర్ఎస్ ఈ మేరకు తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశామని ప్రకటించారు. తాము అన్ని పార్టీలనూ సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. కొడంగల్ లోనే శాంతిభద్రతల సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు.
Next Story

