Thu Mar 19 2026 03:10:05 GMT+0530 (India Standard Time)
రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డి హంగామా

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హంగామా చేస్తున్నారు. గత సంవత్సరం రాహుల్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదటిసారి తెలంగాణకు వస్తున్న రాహుల్ కు అందరు నేతలూ స్వాగతం పలికారు. అయితే, రేవంత్ మాత్రం ఈ పర్యటనలో చురుగ్గా మారారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు మొదలుకొని రాహుల్ గాంధీ పర్యటించే అన్ని మార్గాల్లో హోర్డింగులు, కటౌట్ లతో రేవంత్ నింపారు. పెద్దఎత్తున రేవంత్ జనసమీకరణ చేశారు. తన మార్కు ఉండేలా రేవంత్ టీషర్టులు, జెండాలు, ప్లకార్డులు పట్టుకుని రేవంత్ అనుచరులు రాహుల్ పర్యటనలో భారీ ఎత్తున కనిపిస్తున్నారు. త్వరలోనే రేవంత్ కు పార్టీలో కీలక పదవి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో రాహుల్ దృష్టిలో పడేందుకు రేవంత్ బాగానే కష్టపడుతున్నట్లు కనపడుతోంది.
Next Story

