Thu Mar 19 2026 08:32:46 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సమాచారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజయవాడలో గుట్ట మీద అమ్మవారు, గుట్ట కింద కమ్మ వారు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై స్పందిస్తూ వారసుల కోసం ఇద్దరు నేతలూ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. కవిత కోసం కేసీఆర్, కుమారుల కోసం డీ.శ్రీనివాస్ ఆరాటపడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న దానం నాగేందర్ టీఆర్ఎస్ లో డీఎస్ కు జరిగిన అవమానంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Next Story

