Mon Mar 23 2026 15:26:18 GMT+0530 (India Standard Time)
హత్యాయత్నంపై స్పందించిన రెస్టారెంట్ యాజమాని

విశాఖపట్నం ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ వద్ద ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ ప్రసాద్ స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీ క్రీయాశీలక సభ్యుడినే అయినా ఈ దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావు జగన్ అభిమాని అని వ్యాఖ్యానించారు. ఎనిమిది నెలలుగా అతడు తమ రెస్టారెంట్ లో పని చేస్తున్నట్లు తెలిపారు. దాడికి వాడిన కత్తి తమ రెస్టారెంట్ లోనిది కాదని, ఎవరో బయటి నుంచి తెచ్చి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఈ ఎవరిదైనా కుట్ర ఉందా అనే కోణంలో ధర్యాప్తు చేయాలని కోరారు.
Next Story

