Thu Mar 19 2026 15:28:53 GMT+0530 (India Standard Time)
పవన్ కి విశ్రాంతి అవసరమే..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మరోసారి కంటి శాస్త్ర చికిత్స జరిగింది. గత నాలుగు నెలలుగా ఆయన కంటి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో నెల రోజుల క్రితం ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, సరిపడా విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆయన కంటికి మళ్లీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో సమస్య మళ్లీ తిరగబడింది. గురువారం బంజారాహిల్స్ లోని సెంటర్ ఫర్ సైట్ లో మళ్లీ శాస్త్ర చికిత్స చేశారు. అయితే, కచ్చితంగా సరిపడా విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు వైద్యులు సూచించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story

