Sun Mar 15 2026 07:40:57 GMT+0530 (India Standard Time)
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం రాజగోపాల్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివసారెడ్డి ని కలసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ దానిని ఆమోదించారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందడం విశేషం. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయింది.
గవర్నర్ ను కలిసేందుకు....
కుటుంబపాలన, అరాచక పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని తెలిపారు. తర్వాత గవర్నర్ తమిళి సై ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Next Story

