Wed Mar 18 2026 22:22:39 GMT+0530 (India Standard Time)
పవన్ కి మచ్చ వస్తుందని స్పందించాలా..?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై నటి రేణూ దేశాయ్ మరోసారి మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన మాటలుగా వైరల్ అవుతున్న వ్యాఖ్యల గురించి స్పందించాలని పవన్ అభిమానులు కోరడంతో ఆమె వారిపై ఫేస్ బుక్ లో విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా తనపై ఎన్ని విమర్శలు చేసినా ఎందుకు స్పందించలేదని పవన్ అభిమానులను ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనను స్పందించమనడం సరికాదన్నారు. ఈ విషయంలో పవన్ కి ఒక రూల్.. నాకొక రూలా? అని ప్రశ్నించారు. తాను ఎన్నడూ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడలేదని, మాట్లాడమని కూడా ఏ రాజకీయ పార్టీ చేప్పలేదని ఆమె పేర్కొన్నారు.
Next Story

