Sun Mar 22 2026 21:33:59 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు స్వల్ప ఊరట

ధర్మాబాద్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వల్ప ఊరట లభించింది. ఈనెల 15న విచారణకు హాజరుకాలేనని చంద్రబాబు వేసిన రీకాల్ పిటీషన్ పై ఇవాళ ధర్మాబాద్ కోర్టులో వాదనలు జరిగాయి. గంటన్నర పాటు జరిగిన వాదనల్లో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర వాదించారు. బిజీ షెడ్యూల్ వల్ల వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కోర్టుకు హాజరుకాలేరని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పగా నవంబర్ 3న హాజరుకావాలని కోర్టు సూచించింది. అయితే, అప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా హాజరుకావడం కుదరదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.
Next Story

