పవన్ ఎవరనీ ఎదగనివ్వరు
జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను ఆయన వివరించారు. పవన్ [more]
జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను ఆయన వివరించారు. పవన్ [more]

జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను ఆయన వివరించారు. పవన్ కల్యాణ్ ఒక విచ్ఛిన్నకర శక్తి అని రాజు రవితేజ చెప్పారు. పవన్ చెప్పేదొకటి చేసేదొకటి అని ఆరోపించారు. తాను పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూశానని ఆయన మౌనం వెనక మోసం ఉందని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. జనసేన పార్టీలో మతం అనే ప్రసక్తి ఉండదని, అయితే ఇటీవల అనేక వేదికలపై పవన్ కల్యాణ్ మతం, కులం గురించే మాట్లాడుతున్నారన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనను పావుగా వాడుకున్నారని తెలిపారు. పవన్ ఎన్నికల సమాయానికి పూర్తిగా మారిపోయారన్నారు. పవన్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. పవన్ ఎవరినీ పార్టీలో ఎదగనివ్వరని ఆయన తెలిపారు.