Fri Mar 20 2026 11:22:45 GMT+0530 (India Standard Time)
అవి ఆవు పేడతో సమానం

బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తో భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రీ ప్రేమాయణం సాగిస్తున్నారని వస్తున్న వార్తలను రవిశాస్త్రీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఆవు పేడతో సమానమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిమ్రత్ తో డేటింగ్, ప్రేమాయణం అంటూ తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపించారు. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇక నిమ్రత్ కూడా ఈ వార్తలను ఖండించారు. 2015లో ప్రముఖ కార్ల కంపెనీ ఆడికి అంబాసిడర్లుగా పనిచేసిన సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story

