Thu Mar 26 2026 07:37:40 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : టీడీపీలో బిగ్ వికెట్ డౌన్...రాజీనామా

ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి ఇది ఎదురుదెబ్బే. కొద్దిసేపటి క్రితం శాసనసభ కార్యాలయంలో రావెల కిశోర్ బాబు తన రాజీనామాలేఖను సమర్పించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామాలేఖను సమర్పించారు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపారు. ఆయన జనసేన పార్టీలో చేరే యోచనలో ఉన్నారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి రేపు తన అనుచరులతో భారీ ర్యాలీగా తరలి వెళ్లి పవన్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.గత కొంత కాలంగా తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీలో చోటు చేసుకుంటున్న సంఘటనలతో అసహనంతో ఉన్న రావెల ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

