Tue Mar 24 2026 02:12:07 GMT+0530 (India Standard Time)
ఆ మూడు జిల్లాల్లో మహాకూటమిదే ఆధిక్యం

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, డిసెంబర్ 11 తర్వాత ప్రగతి భవన్ మహాకూటమిదే అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ పేర్కొన్నారు. తాను అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించానని...ఈ మూడు జిల్లాల్లోనూ మహాకూటమిదే ఆధిక్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను పక్కాగా సర్వే చేయించానని, కేసీఆర్ ది రాత్రిపూట చేసే గ్లాస్ సర్వే అయితే తనది గ్రాఫ్ సర్వే అని ఎద్దేవా చేశారు. ఇక సెటిలర్లను కేసీఆర్ తిడుతుంటే కేటీఆర్ బుజ్జగిస్తున్నారని, ఎంత బతిమాలినా కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ గెలవదని, గెలిస్తే చెప్పు నెత్తిన పెట్టుకుంటానని పేర్కొన్నారు.
Next Story

