Tue Mar 24 2026 10:47:13 GMT+0530 (India Standard Time)
బాబూ ముందు కుర్చీ కాపాడుకో....!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి ముందు తన కుర్చీని కాపాడుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక రాజ్యం నడుస్తోందన్నారు. దేశాన్ని కాపాడటానికే తాను ఢిల్లీ వచ్చానని చెబుతున్న చంద్రబాబు ఏదేశమో ముందు చెప్పాలన్నారు. భారతదేశమా..? తెలుగుదేశమా? అనేది విడమర్చి చెప్పాలని రామ్ మాధవ్ కోరారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తప్పదని రామ్ మాధవ్ తెలిపారు. అందరినీ వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు నైజమని, తొలుత మామ ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టి పార్టీ నేతలకు వెన్నుపోటు పొడిచారని రామ్ మాధవ్ విమర్శించారు.
Next Story

