Wed Mar 25 2026 03:07:39 GMT+0530 (India Standard Time)
పరారీలో లేను.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ తెలిపారు. ఆయన ఒక ఆడియో టేపును విడుదల చేశారు. ఈ సందర్భంగా [more]
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ తెలిపారు. ఆయన ఒక ఆడియో టేపును విడుదల చేశారు. ఈ సందర్భంగా [more]

స్వర్ణ ప్యాలెస్ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ తెలిపారు. ఆయన ఒక ఆడియో టేపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరును విమర్శించారు. దుర్ఘటన సర్ణ ప్యాలెస్ లో జరిగితే దానిని వదిలేసి ప్రభుత్వం తమ ఆసుపత్రిపై పడటమేంటిన ప్రశ్నించారు. మున్సిపాలిటీ నిబంధనలను కూడా స్వర్ణ ప్యాలెస్ పాటించలేదన్నారు. తమ ఆసుపత్రి పూర్తి స్థాయి నిబంధనలను పాటిస్తుందని చెప్పారు. తాను పరారీలో లేనని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని ఎండీ రమేష్ తెలిపారు. తాను ఈ సమస్యను న్యాయబద్ధంగానే పోరాడతానని చెప్పారు.
Next Story