Sat Mar 21 2026 02:45:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్...జగన్ నివాసానికి రమణ దీక్షితులు

ఇటీవల ఉద్వాసనకు గురైన రమణ దీక్షితులు ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ తో భేటీ అయ్యారు. గురువారం పాదయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఇంటికి చేరుకున్న జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. ఇటీవల రమణ దీక్షితులు టీటీడీపై, తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన జగన్ తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు వివరించానని, తానేమీ రాజకీయాలు చేయడానికి కలవలేదని రమణ దీక్షితులు స్పష్టం చేశారు.
Next Story

