Mon Mar 16 2026 17:51:54 GMT+0530 (India Standard Time)
ప్రశ్నిస్తే ఇక లోపలెయ్యడమేనా?
ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను [more]
ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను [more]

ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను రామకృష్ణ ఖండించారు. భావప్రకటనా స్వేచ్ఛకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. దేశమంతా కరోనాతో అలమటించి పోతుంటే జగన్ మాత్రం రాజకీయ కక్ష సాధింపుచర్యలకు దిగుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. తనను ఎవరు విమర్శించినా ఇలాగే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ తన తీరు మార్చుకోవాలని రామకృష్ణ సూచించారు.
Next Story